Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం రేటు హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఒక రోజు 200 రూపాయలు తగ్గితే.. మరో రోజు 500 రూపాయల ధర పెరుగుతుంది. ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2023, 12:45 PM IST
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు

Gold Rate: గత కొంత కాలంగా బంగారం రేటు భారీ ఎత్తున పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యం లో బంగారం రేట్ల విషయంలో హెచ్చు తగ్గులు నమోదు అవుతున్నాయి. రెండు వందల రూపాయలు తగ్గిందని సంతోషించే లోపు అయిదు వందల రూపాయలు పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. బంగారం రేటు రూ.50,000 క్రాస్ చేసి ఎన్నో వారాలు కాలేదు. అప్పుడే అరవై వేల రూపాయలకు చేరువ అవుతోంది. ప్రస్తుతం దేశంలో బంగారం కొనుగోల్లు మందకోడిగా కొనసాగుతున్నాయి. అయినా కూడా అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ లో ఉన్న పరిస్థితుల కారణంగా ఇక్కడ కూడా మార్పులు జరుగుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి షాక్ ఇస్తూ మళ్లీ బంగారం రేటు పెరిగింది. 

నేడు ( ఆగస్టు 22) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి రూ. 54,150 ధర ఉండగా , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,070 గా ఉంది. నిన్నటి తో పోల్చితే దాదాపుగా రూ.50 పెంరిగింది. దేశ వ్యాప్తంగా కాస్త అటు ఇటుగా అన్ని చోట్ల కూడా 50 రూపాయల చొప్పున నిన్నటి ధర కంటే పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి. పెళ్లిల సీజన్ మొదలు అయిన తర్వాత మళ్లీ బంగారం అమ్మకాలు, కొనుగోలు పుంజుకుంటుందని మార్కెట్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. బంగారంపై ఉన్న మక్కువతో కొందరు ఎంత డబ్బు అయినా పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. సామాన్యులకు ఇప్పటికే బంగారం అందని ద్రాక్ష అన్నట్లుగా మారింది.

Also Read: Samsung: శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, 440 మెగాపిక్సెల్ కెమేరా

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,070 గా కొనసాగుతుంది. ఈ ధర రేపు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే 24 క్యారెక్ల బంగారం ధర 60 వేలను క్రాస్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు. ఇక బంగారంతో పాటు వెండి కూడా పరుగులు తీస్తోంది. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌ లో కేజీ వెండి ధర రూ.76,500 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే రేటుకు వెండిని వర్తకులు అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నారు. బంగారం, వెండి ధరలు ఇలా ఆకాశం వైపు దూసుకు పోతూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటో..?

Also Read: Kothagudem BRS MLA Ticket: కొత్తగూడెంలో సీన్ చేయొద్దని మంత్రి హరీశ్ రావు క్లాస్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News